కామాంధుడి ఘాతుకానికి మరో యువతి బలి..

కామాంధుడి ఘాతుకానికి మరో యువతి బలి..
x
Highlights

కామాంధుడి ఘాతుకానికి మరో యువతి బలైంది. అరకులోయలో దారుణం చోటుచేసుకుంది. గిరిజన యువతిని అత్యాచారం చేసి.. అనంతరం రాయితో మోది దారుణంగా హతమార్చాడో...

కామాంధుడి ఘాతుకానికి మరో యువతి బలైంది. అరకులోయలో దారుణం చోటుచేసుకుంది. గిరిజన యువతిని అత్యాచారం చేసి.. అనంతరం రాయితో మోది దారుణంగా హతమార్చాడో దుర్మార్గుడు. ఈ ఘటన అరకు మండలం శరభగూడ సీ.ఏ.హెచ్ పాఠశాల సమీపంలో చోటుచేసుకుంది. చినలబుడు గ్రామానికి చెందిన పుష్ప స్థానిక మీసేవలో పనిచేస్తోంది. ఆమె శుక్రవారం స్థానిక యువకుడి చేతిలో అత్యాచారానికి గురై హత్యగావించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. యువతి హత్య అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. ఇటు పుష్ప తల్లిదండ్రులు, బంధువులు నిందితున్ని తమకు అప్పగించాలని పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. కాగా యువతి దారుణ హత్యతో మన్యంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories