డ్రగ్స్ రాకెట్‌ గుట్టు రట్టు.. టాలీవుడ్ నటి అరెస్టు

డ్రగ్స్ రాకెట్‌ గుట్టు రట్టు.. టాలీవుడ్ నటి అరెస్టు
x
Highlights

ముంబయిలో డ్రగ్స్ రాకెట్‌ను గుట్టు రట్టు చేశారు పోలీసులు. ముంబయిలోని ఒక ప్రముఖ హోటల్‌లో డ్రగ్స్ దందా జరుగుతున్నట్లుగా ఎంసీబీ అధికారులకు సమాచారం...

ముంబయిలో డ్రగ్స్ రాకెట్‌ను గుట్టు రట్టు చేశారు పోలీసులు. ముంబయిలోని ఒక ప్రముఖ హోటల్‌లో డ్రగ్స్ దందా జరుగుతున్నట్లుగా ఎంసీబీ అధికారులకు సమాచారం రావడంతో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో టాలీవుడ్ నటితో పాటు మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మిరా రోడ్‌లోని ఓ హోటల్‌లో జరిపిన ఈ దాడుల్లో టాలీవుడ్‌లో పలు సినిమాలలో నటించిన నటిని అధికారులు గుర్తించారు. తెలుగు నటితో పాటు చాంద్ మహ్మద్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని, వారి వద్ద ఉన్న 400 గ్రాముల సరకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సరకులో మెపిడ్రిన్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీని ధర మొత్తం రూ.8 నుంచి 10 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు చెప్పారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు దాడుల్లో టాలీవుడ్ నటిని అరెస్టు చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories