Top
logo

యువకుడిని దారుణంగా హతమార్చిన దుండగులు

యువకుడిని దారుణంగా హతమార్చిన దుండగులు
Highlights

కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.. గుడివాడలోని దనియాల పేటలో భార్గవ్‌ అనే వ్యక్తిని గుర్తుతెలియని...

కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.. గుడివాడలోని దనియాల పేటలో భార్గవ్‌ అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. కత్తులతో మెడ మీద దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి ఇంటి సమీపంలోనే ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. నిందితులను గుర్తించేందుకు క్లూస్‌ టీమ్‌, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గురైన భార్గవ్‌ గతంలో ఓ హత్యకేసులో ప్రధాన ముద్దాయిగా పోలీసులు గుర్తించారు. ఈ ఉదంతంతో స్థానికులు హడలిపోయారు.

Next Story


లైవ్ టీవి