Top
logo

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. మరో 17 మందికి తీవ్ర గాయాలు..

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. మరో 17 మందికి తీవ్ర గాయాలు..
Highlights

జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ బోల్తాపడటంతో ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటన...

జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ బోల్తాపడటంతో ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటన ఇటిక్యాల మండలం మునగాల గ్రామ శివారులోని జాతీయ రహదారిపై సోమవారం రాత్రి 11 గంటల సమయంలో చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మల్లికార్జున్‌ (45), పార్వతమ్మ (39), అయిజ మండలం మేడికొండకు శైలజ (10) అక్కిడికక్కడే మృతిచెందారు. మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గద్వాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇందులో 8మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా గద్వాలలోని జమ్ములమ్మ దేవతను దర్శించుకొనేందుకు సోమవారం రాత్రి బయలుదేరారు.

Next Story


లైవ్ టీవి