హత్యకేసులో అరెస్ట్ అయిన సినీ నటుడు

హత్యకేసులో అరెస్ట్ అయిన సినీ నటుడు
x
Highlights

తీగలాగితే డొంకంతా కదిలినట్టు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపార వేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో బోలెడు పెద్ద పేర్లు...

తీగలాగితే డొంకంతా కదిలినట్టు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపార వేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో బోలెడు పెద్ద పేర్లు బయటకు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల పోలీసులు ఈ కేసును అన్నీ కోణాల్లో ఎంక్వౌరీ చేసి విచారణ మొదలుపెట్టారు. తాజాగా పోలీసుల అనుమానం సినీ నటుడు సూర్య ప్రసాద్, కిషోర్ మరియు అంజిరెడ్డిల పైకి మళ్లదాంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరు ప్రత్యక్షంగా హత్య చేయకపోయినప్పటికీ హత్య కుట్రలో వీరు భాగస్వామ్యులు అని పోలీసులు నిర్థారించారు.

ఈ ముగ్గురిని రేపు మీడియా ముందుకు ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. ఇప్పటికే సేకరించిన విషయాలు తెలియజేయడమే కాక, ఇంకా తేలాల్సిన విషయాలను రేపు పోలీసులు వెళ్లడించే అవకాశం ఉంది. సినీ నటుడు సూర్య ప్రసాద్ అరెస్ట్ తో ఇండస్ట్రీ లో కలకలం రేవుతోంది. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా చిత్రాల్లో నటించిన సూర్య ప్రసాద్ కు గత కొంత కాలంగా అవకాశాలు లేవు. ఇక అంజిరెడ్డికి ముందుగానే హత్యగురించి తెలిసినప్పటికీ పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంతో అరెస్ట్ చేశారు. ఇంకా సాక్ష్యుల కోసం పోలీసులు విచారిస్తూనే ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories