Top
logo

అనంతలో నరబలి..గుడి పూజారితో పాటు..

అనంతలో నరబలి..గుడి పూజారితో పాటు..
Highlights

అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని ముగ్గురి ప్రాణాలను గుప్త నిధులు బలిగొన్నాయి. తనకల్లు...

అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని ముగ్గురి ప్రాణాలను గుప్త నిధులు బలిగొన్నాయి. తనకల్లు మండలం కొర్తికోటలో పాత శివాలయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. దారుణ హత్యకు గురైన ముగ్గురిని శివరామిరెడ్డి, కమలమ్మ, సత్యలక్ష్మీగా గుర్తించారు. గుడి పూజారి శివరామిరెడ్డితో పాటు సోదరి కమలమ్మ ఇక్కడే నివసించేవారు. మహాశివుడి సన్నిధిలో నిద్ర చేసేందుకు సత్యవతి అనే మహిళ బెంగళూరు నుంచి వచ్చింది. అర్ధరాత్రి సమయంలో గుడిలోకి ప్రవేశించిన దుండగులు అక్కడే ఉన్న ముగ్గురిని అత్యంత దారుణంగా హతమార్చారు. హత్య అనంతరం ఆ రక్తంను గుడిలో ఉన్న శివలింగం మీద, గుడి లో ఉన్న పుట్టల మీద చల్లారు. దీంతో క్షుద్రపూజల కోసమే వీరిని నరబలి ఇచ్చారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గ్రామస్థులు. ఒకేసారి మూడు హత్యలు జరగడంతో స్థానికులంతా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Next Story


లైవ్ టీవి