తిరుపతి ఆలయంలో కిరీటాల చోరీ వారిపనే..

తిరుపతి ఆలయంలో కిరీటాల చోరీ వారిపనే..
x
Highlights

శనివారం టీటీడీ పరిధిలోని ప్రధాన ఆలయాల్లోని గోవిందరాజస్వామి ఆలయంలో మూడు కిరీటాలు మాయమైన సంగతి తెలిసిందే.. ఈకేసును ఛాలెంజ్ గా తీసుకున్న తిరుపతి అర్బన్...

శనివారం టీటీడీ పరిధిలోని ప్రధాన ఆలయాల్లోని గోవిందరాజస్వామి ఆలయంలో మూడు కిరీటాలు మాయమైన సంగతి తెలిసిందే.. ఈకేసును ఛాలెంజ్ గా తీసుకున్న తిరుపతి అర్బన్ పోలీసులు టీటీడీ విజిలెన్స్‌ సహాయంతో .. ఎట్టకేలకు ఓ అంచనాకు వచ్చారు. భక్తుల ముసుగులో వచ్చిన బయటి వ్యక్తులే కిరీటాలను దొంగిలించుకెళ్లినట్టు గుర్తించారు. అర్చకులు గర్భాలయంలో లేని సమయంలో చోరీ జరిగినట్టు తేల్చారు. ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న అర్చకులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆలయంలోకి దొంగలు పడ్డారని పోలీసులు, టీటీడీ విజిలెన్స్‌ ప్రాథమిక విచారణలో తేల్చారు.

ఈ క్రమంలో సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు కొంతమంది అనుమానితులను గుర్తించారు. అందులో భాగంగా ఒక ఆటో డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. చోరీకి పాల్పడ్డ వారి కోసం ఆరు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఫోటోలోని వ్యక్తి ఆచూకీ తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని.. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తిరుపతి అర్బన్ ఎస్పీ చెప్పారు. కాగా ఆటో డ్రైవర్‌తో పాటు తిరుపతిలో స్థిరపడిన తమిళనాడుకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories