Top
logo

స్పా సెంటర్ల ముసుగులో 'థాయ్' యువతులతో వ్యభిచారం.. .. నిర్వాహకుల అరెస్ట్!

స్పా సెంటర్ల ముసుగులో
X
Highlights

విజయవాడలో టాస్క్ ఫోర్స్ అధికారులు స్పా సెంటర్లపై దాడులు నిర్వహించారు. మసాజ్ ముసుగులో వ్యభిచారం చేయిస్తున్న నిర్వాహకులను అరెస్ట్ చేశారు.

విజయవాడలో టాస్క్ ఫోర్స్ అధికారులు స్పా సెంటర్లపై దాడులు నిర్వహించారు. మసాజ్ ముసుగులో వ్యభిచారం చేయిస్తున్న నిర్వాహకులను అరెస్ట్ చేశారు. థాయ్ లాండ్ కు చెందిన నలుగురు యువతులతో పాటు ఢిల్లీ, అరుణాచల్ ప్రదేశ్, కేరళకు చెందిన ముగ్గురు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. విదేశీ యువతుల నుంచి పాస్‌పోర్ట్‌లు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ పోలీసుల దాడిలో విదేశీ యువతులు పట్టుబడటం ఇదే తొలిసారి.

ఈ సందర్భంగా యువతులను రెస్క్యూ హోమ్ కు తరలించిన అధికారులు స్పా సెంటర్ల నిర్వాహకులపై ఐపీసీ 370(2), ఐటీపీ చట్టంలోని 3,4 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. పోలీసులు దాడులు నిర్వహించడంతో స్పా సెంటర్లకు విటులను తీసుకొస్తున్న మధ్యవర్తి రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతోనే తాము భారత్ కు వచ్చామని థాయ్ లాండ్ యువతులు చెబుతున్నారు.

Next Story