Top
logo

వైయస్ షర్మిలపై దుష్ప్రచారం కేసులో ఇద్దరు అరెస్ట్..

వైయస్ షర్మిలపై దుష్ప్రచారం కేసులో ఇద్దరు అరెస్ట్..
Highlights

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైయస్ జగన్ సోదరి వైఎస్‌ షర్మిలపై కొంతకాలంగా ...

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైయస్ జగన్ సోదరి వైఎస్‌ షర్మిలపై కొంతకాలంగా అసభ్యమైన పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే. దీంతో తీవ్రంగా స్పందించిన షర్మిల గత నెల హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును ఛాలెంజ్ గా తీసుకున్న సైబర్‌ క్రైం పోలీసులు పురోగతి సాధించారు. సామాజిక మాధ్యమాల ద్వారా షర్మిలని అప్రదిష్ట పాలు చేసేందుకు కుట్ర పన్నిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

వారిలో ప్రకాశం జిల్లా చోడవరంకు చెందిన పెద్దిశెట్టి వెంకటేశ్‌ను గుంటూరులో సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలాగే మంచిర్యాలకు చెందిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని కూడా హైదరాబాద్‌ తరలించే అవకాశాలు ఉన్నాయి. మరికొందరిని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. వీరిపై ఐపీసీ సెక్షన్‌ 509, 67ఐటీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.

Next Story


లైవ్ టీవి