Top
logo

మీడియా అధినేత అనుమానాస్పద మృతి కేసులో కొత్తకోణం

మీడియా అధినేత అనుమానాస్పద మృతి కేసులో కొత్తకోణం
X
Highlights

ప్రముఖ ఎన్నారై, మీడియా అధినేత చిగురుపాటి జయరామ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసును...

ప్రముఖ ఎన్నారై, మీడియా అధినేత చిగురుపాటి జయరామ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపడుతున్నారు. మొదట బ్యాంకు అధికారులను, కారు డ్రైవర్‌ను పోలీసులు విచారించరించగా.. తాజాగా జయరాం మేనకోడలు శిఖా చౌదరిని పోలీసులు ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. దీంతో మరో 24 గంటల్లో ఈ హత్య వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

కాగా శుక్రవారం తెల్లవారుజామున కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం దగ్గర హైవేపై కారులో జయరామ్‌ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనకు పాల్పడిందెవరు..? ఆర్ధికలావాదేవీలే ఇతని మృతికి కారణమా? అనే కోణంలో విచారిస్తున్నారు. మరోవైపు చిగురుపాటి హత్యకు హైదరాబాద్‌‌లోనే కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Next Story