Top
logo

ప్రముఖ మీడియా అధినేత అనుమానాస్పద మృతి

ప్రముఖ మీడియా అధినేత అనుమానాస్పద మృతి
X
Highlights

కృష్ణాజిల్లా నందిగామ సమీపంలోని కీసర టోల్‌గేట్, ఐతవరం సమీపంలో కారులో మృతదేహం లభ్యమైంది. కారులో రక్తపు మడుగులో...

కృష్ణాజిల్లా నందిగామ సమీపంలోని కీసర టోల్‌గేట్, ఐతవరం సమీపంలో కారులో మృతదేహం లభ్యమైంది. కారులో రక్తపు మడుగులో పడివున్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త, మీడియా అధినేత చిగురుపాటి జయరాంగా గుర్తించారు. కార్లో వెనక సీట్లో కూర్చున్న ఆయన తలపై బలమైన గాయాలున్నాయి. రోడ్డు ప్రమాదం జరిగిన దాఖలాలు కూడా అక్కడ కనిపించడం లేదు. అయితే కారులో మద్యం సీసాలు ఉన్నట్లు తెలుస్తోంది.

జయరాం అనుమానాస్పద మృతి వెనక హత్యా కోణం ఏమైనా ఉందా..? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుని బ్యాంక్ లావాదేవీలు, కాల్ డేటాపై దృష్టి పెట్టామని వెల్లడించారు. జయరాం రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి విజయవాడకు బయల్దేరి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Next Story