బ్లేడుతో గొంతుకోసుకుని.. యువకుని పరుగులు!

బ్లేడుతో గొంతుకోసుకుని.. యువకుని పరుగులు!
x
Highlights

సికింద్రాబాద్ స్టేషన్ వద్ద కలకలం చోటుచేసుకుంది. బ్లేడుతో గొంతుకోసుకుని ఒక యువకుడు పరుగులు తీశాడు. దీంతో ఆ ప్రాంతంలో అలజడి రేగింది. వివరాలిలా ఉన్నాయి....

సికింద్రాబాద్ స్టేషన్ వద్ద కలకలం చోటుచేసుకుంది. బ్లేడుతో గొంతుకోసుకుని ఒక యువకుడు పరుగులు తీశాడు. దీంతో ఆ ప్రాంతంలో అలజడి రేగింది. వివరాలిలా ఉన్నాయి. ఈ ఉదయం సికింద్రాబాద్ స్టేషన్ వద్ద ఓ యువకుడు బ్లేడుతో గొంతుకోసుకున్నాడు. తరువాత బాధతో అరుస్తూ పరుగులు తీశాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో పోలీసులు అక్కడకు చేరుకొని యువకుని ఆసుపత్రికి తరలించారు. ముందు అతనిపై దుండగులు దాడి చేసి ఉంటారని భావించారు. కానీ, ఆ యువకుడు పారంలో నష్టాలు, అప్పుల బాధ, ఆరోగ్య సమస్యలు వేధిస్తుండడంతో తానే ఆత్మహత్యా ప్రయత్నం చేశానని చెప్పాడు. ధితుడిని నెల్లూరుకు చెందిన ప్రశాంత్‌గా గుర్తించిన పోలీసులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories