కథువాలో చిన్నారిని ఎందుకు చంపేశారు?

కథువాలో చిన్నారిని ఎందుకు చంపేశారు?
x
Highlights

పగ అనండి.. కక్ష అనుకోండి.. పేరేదైనా కానీ, దానికి మానవత్వం ఉండదు. మంచీ చెడూ విచక్షణ అసలే ఉండదు. ఒక్కోసారి చిన్న సంఘటన కూడా పెద్ద ఘటనకు కారణంగా...

పగ అనండి.. కక్ష అనుకోండి.. పేరేదైనా కానీ, దానికి మానవత్వం ఉండదు. మంచీ చెడూ విచక్షణ అసలే ఉండదు. ఒక్కోసారి చిన్న సంఘటన కూడా పెద్ద ఘటనకు కారణంగా మారిపోతుంది. మనిషి విచక్షణను చంపేసి.. మృగాన్ని చేస్తుంది. సరిగ్గా ఇదే జరిగింది పంజాబ్ రాష్ట్రంలోని కథువా గ్రామంలో! తమ ప్రాంతంలో గుర్రాల్ని మేపుతున్నారన్న ఒక చిన్న కారణం.. తమ మాటను పెడచెవిన పెట్టారన్న అతి చిన్న ఆక్రోశం కథువాలో ఓ చిన్నారిని చిదిమేసింది.

ఈరోజు కథువాలో చిన్నారిని పాశవికంగా చంపిన కేసులో కోర్టు నిందితులకు కఠిన శిక్షలు విధిస్తూ తుది తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అసలు కథువా లో ఏం జరిగింది.. చిన్నారిని అంత పైశాచికంగా హతమార్చడానికి కారణాలేమిటి? ఆ వివరాలు మీకోసం..

అసలు కేసేమిటి ?

2018 జనవరి 10 న కథువా గ్రామంలో ఓ చిన్నారి గుర్రాలను మేపడానికి వెళ్లి కనిపించకుండా పోయింది. ఆమె కోసం వెదికిన తల్లిదండ్రులు ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఆ చిన్నారి కోసం సమీపంలోని అడవి లో వెదికారు. అక్కడ వారం రోజుల తరువాత బాలిక మృతదేహం దొరికింది. పోస్ట్ మార్టంలో ఆ చిన్నారిపై అత్యాచారం జరిగిందనీ, బండరాయితో తలమీద మోది చంపేశారని తేలింది.

ఎందుకు ఇలా చేశారు?

భూవివాదమే ఈ సంఘటనకు ప్రధాన కారణం. ఈ ప్రాంతంలో బక్రవాల్ అనే సంచార తెగ వారుంటారు. వారి కుటుంబాల్లోని బాలికే మృతురాలు. వీరు రవాణాకు ఉపయోగించే గుర్రాలను గ్రామ పొలాల్లో మేపడానికి తీసుకువెళతారు. ఈ క్రమంలో తమ ప్రాంతంలో అనుమతి తీసుకోకుండా గుర్రాలను మేపుతున్నారని కథువా లోని గ్రామస్థులు వారితో గొడవ పెట్టుకున్నారు. ఇది పెద్దగా మారింది. ఈ నేపథ్యంలో అక్కడి ఆలయ పూజారి.. ఈ తెగ వారిని ఆ ప్రాంతం నుంచి తరిమేయాలని పథకం వేశాడు. ఆ పథకానికి బాలిక బాలి అయిపొయింది.

ఏంచేశారు?

గత ఏడాది జనవరి 10న గుర్రాలను మేపేందుకు గ్రామ సమీపంలోని పొలాలకు వెళ్లింది చిన్నారి. విషయం తెలిసి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అక్కడికి వెళ్లారు. బాలికను ఎత్తుకెళ్లి సమీపంలోని ఓ దేవాలయంలో బంధించారు. గుళ్లో ఆ చిన్నారికి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరి తర్వాత మరొకరుగా పసిపాపపై తమ పశవాంఛను తీర్చుకున్నారు. అనంతరం రాయితో చిన్నారిని కొట్టి చంపి అడవిలో విసిరేశారు.

ఎలా దొరికారు?

బాలిక మృత దేహం దొరికిన తరువాత నిందితులు ఈ ఘోరాన్ని కప్పిపుచ్చేందుకు స్థానిక పోలీసులకు పెద్ద మొత్తంలో డబ్బు ముట్టచెప్పారు. అయితే, ఈ కేసును ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకొని దర్యాప్తుచేయడంతో అందరి బాగోతాలు బయటపడ్డాయి. ఆలయ పూజారి సాంజీరామ్‌తో పాటు అతడి 22 ఏళ్ల కుమారుడు, పోలీస్ అధికారులుతో పాటు మొత్తం ఏడుగురిని నిందితులుగా చేర్చింది. మొదట ఈ కేసును క్రైమ్‌ బ్రాంచ్‌కు అప్పగించారు. అక్కడ పరిస్థితులు దర్యాప్తునకు అనుకూలంగా లేకపోవడంతో సుప్రీంకోర్టు పఠాన్‌కోట్‌ కోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసులో సోమవారం తీర్పు వెల్లడించిన కోర్టు ఆరుగురిని దోషులుగా పేర్కొంటూ తీర్పు వెల్లడించింది. సాంజిరామ్ కుమారుడిని నిర్దోషిగా ప్రకటించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories