విషపూరిత మద్యం తాగి దాదాపు 150 మంది మృతి

విషపూరిత మద్యం తాగి దాదాపు 150 మంది మృతి
x
Highlights

అసోంలో ఘోర విషాదం వెలుగులోకి వచ్చింది. విషపూరిత మద్యం తాగి దాదాపు 150 మంది మృతిచెందారు. మరో 200 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు ఇది దేశంలోనే...

అసోంలో ఘోర విషాదం వెలుగులోకి వచ్చింది. విషపూరిత మద్యం తాగి దాదాపు 150 మంది మృతిచెందారు. మరో 200 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు ఇది దేశంలోనే అతిపెద్ద కల్తీ మద్యం ఘటనగా పేర్కొంటున్నారు. గోలాఘాట్‌లోని సల్మారా టీ ఎస్టేట్‌లో పనిచేస్తున్న కూలీలు గురువారం రాత్రి వేడుక చేసుకున్నారు. అందులో భాగంగా అంతా కలసి మద్యం సేవించారు. అయితే అది కలుషిత మద్యం అని కాసేపటికే తెలిసినా.. ఈలోపే జరగాల్సిన నష్టం జరిగింది.మద్యం సేవించిన కాసేపటికే ఇద్దరు మహిళలు మృతిచెందారు.

వారు విషపూరిత మద్యం తీసుకోవడం వల్లే వారు మరణించినట్లు వైద్యులు తెలిపారు. శుక్రవారం ఉదయం మరో 13 మంది, శనివారం నాటికి మృతుల సంఖ్య 84కు చేరుకోగా.. ప్రస్తుతం అది 150గా మారింది. ఈ ఘటనలో మద్యం అమ్మిన వ్యక్తి సంజు ఒరాంగ్‌, అతడి తల్లికూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. రసాయనాలు కలిగిన క్యాన్‌లో ఈ మద్యం తీసుకెళ్లడంతోనే అది కలుషితమై ఈ దుర్ఘటన చోటు చేసుకుందని పోలీసు అనుమానం తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories