తల్లిదండ్రులను ఇంట్లో నుంచి గెంటివేసిన కుమారులు

తల్లిదండ్రులను ఇంట్లో నుంచి గెంటివేసిన కుమారులు
x
Highlights

వృద్ధాప్యంలో కన్నవారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులే.. వారి పాలిట కాలయముడిలా మారారు. కాటికి కాలు చాపిన వయసులో తోడుగా నీడగా ఉండాల్సింది...

వృద్ధాప్యంలో కన్నవారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులే.. వారి పాలిట కాలయముడిలా మారారు. కాటికి కాలు చాపిన వయసులో తోడుగా నీడగా ఉండాల్సింది పోయి.. ఏకంగా ఇంటి నుంచే గెంటేశారు. ఈ హృదయ విదారకమైన సంఘటన వికారాబాద్‌ జిల్లాలో జరిగింది.

పరిగి మండలం రాపోలు గ్రామానికి చెందిన అబ్దుల్‌ రజాక్‌, జాహిదా బేగం దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అబ్దుల్‌ రజాక్‌ పేరుతో.. రాపోలు గ్రామంలో ఏడెకరాల భూమి, ఓ ఇళ్లు ఉన్నాయి. వీళ్లిద్దరూ కొంత కాలంగా హైదరాబాద్‌లో నివశిస్తున్నారు. తాజాగా తమ సొంత గ్రామానికి తిరిగి వచ్చారు. అయితే కొడుకులిద్దరూ.. ఆస్తిని తమ పేరు మీద రాయాలని తరచూ గొడవపడుతుండే వారు. తల్లిదండ్రులు వృద్ధులని చూడకుండా ఇంటి నుంచి గెంటివేశారు. గ్రామంలోని పెద్దలతో మాట్లాడించి.. ఇంటి వెళ్తుంటే, బండ రాయిదో మోదుతామని బెదిరించారు. దీంతో చేసేది లేక చివరికి పోలీసులను ఆశ్రయించారు. కానీ పది రోజులుగా పోలీస్ స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నా.. తమకు న్యాయం జరగడం లేదని బోరున విలపిస్తున్నారు ఆ వృద్ధ దంపతులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories