తండ్రి అంత్యక్రియల్లో గొడవ.. మృతదేహాన్ని సగం కోసివ్వాలన్న కొడుకు..!

sons demand cutting fathers body into two pieces
x

తండ్రి అంత్యక్రియల్లో గొడవ.. మృతదేహాన్ని సగం కోసివ్వాలన్న కొడుకు..!

Highlights

తండ్రి అంత్యక్రియలు నిర్వహించే విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదం తలెత్తింది. తమ్ముడితో వివాదం కారణంగా తండ్రి మృతదేహంలో సగ భాగాన్ని కోసి ఇవ్వాలని డిమాండ్ చేశాడు ఓ కొడుకు.

Madhya Pradesh : తండ్రి అంత్యక్రియలు నిర్వహించే విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదం తలెత్తింది. తమ్ముడితో వివాదం కారణంగా తండ్రి మృతదేహంలో సగ భాగాన్ని కోసి ఇవ్వాలని డిమాండ్ చేశాడు ఓ కొడుకు. ఈ ఉదాంతం మధ్య ప్రదేశ్‌ రాష్ట్రంలోని టీకంగఢ్ జిల్లా లిఢోరతాల్ గ్రామంలో చోటుచేసుకుంది.

ఇటీవల ప్రేమానురాగాలు కరువై పోతున్నాయి. బంధాలు, బంధుత్వాలు దూరమవుతున్నాయి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఆ బంధాలను దూరం చేస్తున్నాయి. భార్య భర్తను, భర్త భార్యను కడతేర్చిన ఘటనలు, అన్నదమ్ముల ఆస్తి వివాదాలు అనేకం చూస్తున్నాం కానీ.. తమ్ముడితో గొడవ కారణంగా తండ్రి మృతదేహాన్నే సగం కావాలని అడిగాడు ఓ ప్రబుద్దుడు.

మధ్యప్రదేశ్ రాష్ట్రాంలోని టీకంగఢ్ జిల్లా లిఢోరతాల్ గ్రామానికి చెందిన దైనీ సింగ్‌ ఘోష్‌కు ఇద్దరు కుమారులు. దేశ్ రాజ్, కిషన్. అయితే వృద్ధ్యాప్య కారణంగా దైనీ సింగ్ చిన్న కొడుకు దేశ్ రాజ్ దగ్గర నివసిస్తున్నారు. ఆదివారం అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచాడు. ఈ విషయం తెలిసిన అతడి పెద్ద కొడుకు కిషన్ తమ్ముడి ఇంటికి వచ్చాడు. తండ్రి అంత్యక్రియలు తానే నిర్వహిస్తానని పట్టుబట్టాడు. అయితే తాను అంత్యక్రియలు నిర్వహించాలన్నది తన తండ్రి చివరి కోరికని దేశ్ రాజ్ అన్నకు తెలిపాడు.

దీంతో తమ్ముడితో గొడవకు దిగిన కిషన్ తండ్రి శరీరాన్ని సగం కోసి తనకు ఇవ్వాలన్నాడు. గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి కిషన్‌కు సర్ధి చెప్పడంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దేశ్ రాజ్ తన తండ్రి దహన సంస్కారాలు నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories