నెల్లూరులో గుట్టుగా వ్యభిచారం.. అలా దొరికారు

నెల్లూరులో గుట్టుగా వ్యభిచారం.. అలా దొరికారు
x
Highlights

నెల్లూరులో గుట్టుగా సాగుతున్నసెక్స్ రాకెట్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని రాంజీనగర్ 7వ వీధిలో ఉన్న ఓ అపార్ట్ మెంట్‎లోని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని బాలాజీనగర్ పోలీసులకు పక్కా సమాచారం అందింది.

నెల్లూరులో గుట్టుగా సాగుతున్నసెక్స్ రాకెట్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని రాంజీనగర్ 7వ వీధిలో ఉన్న ఓ అపార్ట్ మెంట్‎లోని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని బాలాజీనగర్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సోమవారం ఉదయం పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు. వ్యభిచార గృహాన్ని నడుపుతున్న ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. మహిళలను సంరక్షణ కేంద్రాలకు తరలించారు.

కాగా.. ఈ తెర వెనుక తతంగం నడిపిస్తున్న రామచంద్ర, సయ్యాద్ ఖాజా, సుభాషిణిని పోలీసులు అరెస్టు చేశారు. వారితోపాటు ఓ యువతిని అరెస్టు చేశారు. బాలాజీ నగర్‎కు సిఐ సోమయ్య, ఎస్ఐ వీర ప్రతాప్, అంకమ్మలు తమ సిబ్బందితో కలిసి మెరుపు దాడి చేశారు. వ్యభిచారం జరుగుతున్నట్లు నిర్ధారించారు పోలీసులు. వీరి వద్ద నుంచి 13వేల నగదుతోపాటు , 4 మొబైల్లు, స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories