Top
logo

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి
Highlights

తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కంటైనెర్ ను కారు ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన ...

తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కంటైనెర్ ను కారు ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన చెన్నై- బెంగళూరు జాతీయ రహదారిలో జరిగింది. మృతులు మహారాష్ట్రకు చెందిన పోలీస్ అధికారి కుటుంబసభ్యులుగా గుర్తించారు. తమిళనాడులో పర్యాటక ప్రాంతాలను వీక్షించి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను వేలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై విచారణ చేపట్టారు.

Next Story


లైవ్ టీవి