కర్ణాటక వ్యాసరాయుల బృందావనంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు

కర్ణాటక వ్యాసరాయుల బృందావనంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు
x
Highlights

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పరంపర‌కు చెందిన.. వ్యాసరాయుల బృందావనాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. కర్ణాటక...

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పరంపర‌కు చెందిన.. వ్యాసరాయుల బృందావనాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని కొప్పుల జిల్లా గంగావతి వద్ద ఆనేగుంది అనే ప్రాంతంలో ఉన్న ఈ బృందావనాన్ని గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.

ఈ సంఘటన పై శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర స్వాములు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో పురాతనమైన వ్యాసరాయులు, పద్మనాభ తీర్థుల బృందావనం ధ్వంసం చేయడం దారుణమని ఆయన పేర్కొన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్న ఆయన, దుండగులను శిక్షించాలన్నారు. రెవెన్యూ సిబ్బందిని, ఆర్కియాలజీ సిబ్బంది సంప్రదించి వ్యాసరాయలు బృందావనాన్ని పునర్నిర్మాణం కోసం సంప్రదిస్తామని, దీనికి అయ్యే ఖర్చు మొత్తం శ్రీ మరణం భరిస్తుంది అని తెలిపారు,

Show Full Article
Print Article
More On
Next Story
More Stories