Top
logo

కృష్ణాజిల్లా మర్లపాలెంలో విషాదం

కృష్ణాజిల్లా మర్లపాలెంలో విషాదం
X
Highlights

కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం మర్లపాలెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చెరువులో దూకి టీచర్‌ పుష్పలత ఆత్మహత్యకు పాల్పడింది.

కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం మర్లపాలెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చెరువులో దూకి టీచర్‌ పుష్పలత ఆత్మహత్యకు పాల్పడింది. నిడమానూరు ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో ఆమె టీచర్‌గా పనిచేస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కి చెందిన చోడగిరి పుష్పలతగా పోలీసులు గుర్తించారు. చెరువు ఒడ్డున స్కూటీ తన హ్యాండ్ బ్యాగ్ వదిలి చెరువులోకి దూకింది. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఆమె మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పోలీసులు తెలిపారు.

Next Story