చిదంబరం భార్యపై సీబీఐ ఛార్జిషీటు

చిదంబరం భార్యపై సీబీఐ ఛార్జిషీటు
x
Highlights

చిట్ ఫంట్ కుంభకోణంలో చిక్కుకున్న శారదా గ్రూప్ ఆఫ్ కెంపెనీస్ నుంచి రూ.1.4 కోట్లు ముడుపులు తీసుకున్నారన్న అభియోగంపై మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్...

చిట్ ఫంట్ కుంభకోణంలో చిక్కుకున్న శారదా గ్రూప్ ఆఫ్ కెంపెనీస్ నుంచి రూ.1.4 కోట్లు ముడుపులు తీసుకున్నారన్న అభియోగంపై మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ అగ్రనేత పి.చిందంబరం భార్య నళిని చిదంబరంపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ విషయాన్నీ సిబిఐ అధికారులు శుక్రవారం వెల్లడించారు. శారదా గ్రూప్ ఆఫ్ కెంపెనీస్ ప్రొప్రయిటర్ సుదీప్తా సేన్‌ తో కలిసి నళిని చిదంబరం ఈ నేరానికి పాల్పడట్టు సిబిఐ పేర్కొంది. కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టులో ఈ ఛార్జిషీటు నమోదు చేసినట్టు సీబీఐ ప్రతినిధి అభిషేక్ దయాళ్ తెలిపారు.

ఇదిలావుంటే ఆకర్షణీయమైన వడ్డీ రేట్లును ఆశ చూపించి శారదా గ్రూప్ రూ.2.5000 కోట్లు ప్రజల నుంచి వసూలు చేసి తిరిగి చెల్లించని కారణంగా సీబీఐ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో కొందరు ప్రజాప్రతినిధులు ఉన్నట్టు సీబీఐ అప్పట్లో వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories