Top
logo

నిజామాబాద్‌లో అర్ధరాత్రి దోపిడి దొంగల బీభత్సం : బంగారం షాపులే లక్ష్యం

నిజామాబాద్‌లో అర్ధరాత్రి దోపిడి దొంగల బీభత్సం : బంగారం షాపులే లక్ష్యం
X
Highlights

నిజామాబాద్‌లో దోపిడి దొంగల బీభత్సం సృష్టించారు. వరుస చోరీలతో హడలెత్తించారు. ఒక్కరాత్రే మూడు చోట్ల దొంగతనాలకు...

నిజామాబాద్‌లో దోపిడి దొంగల బీభత్సం సృష్టించారు. వరుస చోరీలతో హడలెత్తించారు. ఒక్కరాత్రే మూడు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. జ్యూయలరీ షాపులే టార్గెట్‌గా చోరీలు చేశారు. అర్ధరాత్రి దాటాక.. జరిగిన ఈ దోపిడీల్లో సుమారు 30 తులాల బంగారు ఆభరణాలతో పాటు.. నగదును కూడా ఎత్తుకెళ్లారు.

వినాయక్‌నగర్‌లో ఉన్న మూడు ఆభరణాల షాపుల్లో చోరీలకు పాల్పడ్డారు. అర్ధరాత్రి రెండు గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో చోరీలకు పాల్పడ్డారు. సాయితేజ, శ్రీ సాయిమహాలక్ష్మీ, చరణ్‌తేజ్‌ షాపుల్లో అందినకాడికి దోచుకున్నారు. షట్టర్‌ తాళాలు పగులగొట్టి.. సీసీ టీవీ కేబుల్స్‌ కట్‌ చేసి.. చోరీలకు పాల్పడ్డారు. అయితే ఓ షాపులో చోరీ చేస్తుండగా దృశ్యాలు రికార్డ్‌ అయ్యాయి. ఈ దొంగతనాలతో.. నిజామాబాద్‌ ఉలిక్కిపడింది. ఇటు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు.

Next Story