కశ్మీర్ లో ఘోర ప్రమాదం : 31మంది మృతి

కశ్మీర్ లో ఘోర ప్రమాదం : 31మంది మృతి
x
Highlights

జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 31 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు లోయలో పడిపోవడంతో ప్రమాదం...

జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 31 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు లోయలో పడిపోవడంతో ప్రమాదం సంభవించింది.

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..

కేశ్వాన్‌ నుంచి కిష్త్వార్‌ వెళ్తున్న ఓ ప్రయాణికుల బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 31 మంది అక్కడికక్కడే మృతిచెందినట్లు సీనియర్‌ పోలీసు అధికారులు తెలిపారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన సమయంలో బస్సులో దాదాపు 45 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇప్పటివరకు 20 మృతదేహాలను వెలికితీశామని జమ్మూ ఐజీ ఎంకే సిన్హా తెలిపారు. కాగా గా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. ఘటనపై జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories