దెందులూరులో రోడ్డు ప్రమాదం...15మందికి గాయాలు
Raj29 Dec 2018 3:18 AM GMT
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దెందులూరుకు సమీపంలోని సత్యనారాయణపురంలో శనివారం ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఏలూరు ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్లు, క్లీనర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. లారీని బస్సు ఓవర్ టేక్ చేయబోతుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు శ్రీకాకుళం నుంచి ఒంగోలు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.దెందులూరులో రోడ్డు ప్రమాదం...15మందికి గాయాలుదెందులూరులో రోడ్డు ప్రమాదం...15మందికి గాయాలు
లైవ్ టీవి
కథ...మహా...ఇంకా లక్ష్మి నాయకుడా?
23 Feb 2019 11:08 AM GMTయుగపురుషుడిగా ఎన్టీఆర్
23 Feb 2019 10:45 AM GMTశ్రీ శ్రీ గారు అనుకుంటే..పప్పులో కాలు వేసినట్టే!
23 Feb 2019 10:39 AM GMTమహానాయకుడి చరిత్ర నుండి కొన్ని పేజీలు మాత్రమే!
23 Feb 2019 10:01 AM GMTనాటకమైన, సినిమా అయిన ఈయన స్టైల్ వేరు
18 Feb 2019 10:19 AM GMT