Top
logo

ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి
Highlights

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తనకల్లు మండలం ఎర్రగుంటపల్లిలో లారీ-వ్యాన్‌ ఢీకొన్నాయి. ...

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తనకల్లు మండలం ఎర్రగుంటపల్లిలో లారీ-వ్యాన్‌ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 7గురు దుర్మరణం చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడ్డవారిని స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనాలు రెండూ వేగంగా వస్తుండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తీవ్రంగా గాయపడిన వారిని తనకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో క్షతగాత్రులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది.


లైవ్ టీవి


Share it
Top