Top
logo

Jabardasth: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్

Jabardasth: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్
X

 ఎర్రచందనం (thehansindia)

Highlights

Jabardasth: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ క‌మెడియ‌న్ పేరు తెర‌పైకి వ‌చ్చింది.

Jabardasth: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ క‌మెడియ‌న్ పేరు తెర‌పైకి వ‌చ్చింది. జబర్దస్త్‌తో పేరు తెచ్చుకున్నహరికి ఎర్రచందనం స్మగర్లతో సంబంధాలు పెట్టుకున్నట్టు పోలీసులు గతంలో గుర్తించారు. గ‌తంలో ఎర్ర‌చంద‌నం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మ‌రోసారి హ‌రి ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుతో సంబంధాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో అటవీశాఖ అధికారులు కూంబింగ్ చేస్తున్న సమయంలో.. 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ అయ్యారు. వారి నుంచి రెండు నాటు తుపాకులు.. 3 లక్షల రూపాల‌యలు విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు, ఈ అంశంపై జ‌బర్ధ‌స్త్ హరి స్పందించాడు. పోలీసులు కావాల‌నే త‌న‌ను ఈ కేసులో ఇరికిస్తున్నార‌ని వాపోయాడు. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ త‌న‌కు సంబందం లేద‌ని చెబుతున్నాడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తుంటే.. తాను పోలీసులకు సమాచారం అందించానని... ఆ కోపంతో అతను తనపై తప్పుడు కేసులు పెట్టాడని మండిపడ్డాడు. అయితే ఈ స్మగ్లింగ్ గ్యాంగుతో హరికి సంబంధాలు ఉన్నాయని పోలీసులు చెపుతున్నారు. గతంలోనే హరిపై స్మగ్లింగ్ కేసులతో పాటు, పలు కేసులు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాడనే ఆరోపణలు ఉన్నాయి.

Web TitleRed Sandal Smuggling Case Registered against Jabardasth Hari
Next Story