జ్యోతి హత్య కేసులో కీలక మలుపు

Raj14 Feb 2019 3:02 AM GMT
గుంటూరు జిల్లా అమరావతిలో దారుణ హత్యకు గురైన జ్యోతి మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కుటుంబసభ్యులు, బంధువులు జ్యోతి హత్యపై అనుమానాలు ఉన్నాయని మంగళగిరి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. పోస్టుమార్టంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. కాగా గత సోమవారం రాత్రి తాడేపల్లి పట్టణంలోని మహానాడు రోడ్డుకు చెందిన చుంచు శ్రీనివాసరావు, అంగడి జ్యోతిలపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో యువతి జ్యోతి మృతి చెందగా.. శ్రీనివాసరావు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
లైవ్ టీవి
కథ...మహా...ఇంకా లక్ష్మి నాయకుడా?
23 Feb 2019 11:08 AM GMTయుగపురుషుడిగా ఎన్టీఆర్
23 Feb 2019 10:45 AM GMTశ్రీ శ్రీ గారు అనుకుంటే..పప్పులో కాలు వేసినట్టే!
23 Feb 2019 10:39 AM GMTమహానాయకుడి చరిత్ర నుండి కొన్ని పేజీలు మాత్రమే!
23 Feb 2019 10:01 AM GMTనాటకమైన, సినిమా అయిన ఈయన స్టైల్ వేరు
18 Feb 2019 10:19 AM GMT