ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ రవళి కన్నుమూత

ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ రవళి కన్నుమూత
x
Highlights

ఉన్మాది దాడిలో గాయపడ్డ రవళి కన్నుమూసింది. ఫిబ్రవరి 27న హన్మకొండలో రవళిపై అవినాష్ అనే వ్యక్తి దాడి చేశాడు.ప్రేమను తిరస్కరించిందని హాస్టల్ దగ్గరికి...

ఉన్మాది దాడిలో గాయపడ్డ రవళి కన్నుమూసింది. ఫిబ్రవరి 27న హన్మకొండలో రవళిపై అవినాష్ అనే వ్యక్తి దాడి చేశాడు.ప్రేమను తిరస్కరించిందని హాస్టల్ దగ్గరికి వచ్చి రవళిపై పెట్రోల్ పోశాడు అవినాష్. దీంతో వారం రోజులుగా చికిత్స పొందుతోంది రవళి. ఇవాళ ఆరోగ్యం విషమించి ఆమె మృతిచెందింది. కాగా వరంగల్‌లో రవళికి అత్యవసర చికిత్సనందించినా.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. 70% గాయాల కారణంగా రవళి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

కేయూ రోడ్డులోని గొల్లపల్లి పెట్రోల్‌ బంక్‌ వద్ద అవినాష్ ను పోలీసులు పట్టుకున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన తోపుచర్ల పద్మ, సుధాకర్‌రావు దంపతుల కూతురు రవళి (22) హన్మకొండ రాంనగర్‌ ప్రాంతంలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో బీఎస్సీ(ఎంఈసీఎస్‌) ఫైనలియర్‌ చదువుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories