Top
logo

కామారెడ్డి జిల్లాలో దారుణం : బరితెగిస్తున్న కామాంధులు

కామారెడ్డి జిల్లాలో దారుణం :  బరితెగిస్తున్న కామాంధులు
X
Highlights

మతిస్థిమితం లేని దివ్యాంగురాలిపై ఇద్దరు లైంగిక దాడి..కామారెడ్డి జిల్లాలో కామాంధులు బరి తెగిస్తున్నారు.. తాగిన మ...

మతిస్థిమితం లేని దివ్యాంగురాలిపై ఇద్దరు లైంగిక దాడి..

కామారెడ్డి జిల్లాలో కామాంధులు బరి తెగిస్తున్నారు.. తాగిన మత్తులో కొందరు మగాళ్లు మృగాళ్లలా మారుతున్నారు. జిల్లాలో వరుసగా జరిగిన ఘటనలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి.. తాజాగా జిల్లా కేంద్రంలో ఇద్దరు కామాంధులు బరి తెగించారు.. మతిస్థిమితం లేని ఓ దివ్యాంగురాలపై లైంగిక దాడి చేశారు.. అంతటితో ఆగకుండా బాధితురాలిపై రాడ్డుతో దాడి చేశారు.. దీంతో 24 గంటల పాటు మృత్యువుతో పోరాడి ఆమె మృతి చెందింది. ఈ ఘటనలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు..

మరో సంఘటనలో సదాశివ నగర్ మండలం లింగంపల్లిలో ఢిగ్రీ యువతిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.. అపస్మారక స్థితిలో పడివున్న ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.. ఈ రెండు ఘటనల్లోనూ పోలీసులు విచారణ చేపట్టారు..

Next Story