జయరాం హత్యకేసు మరో మలుపు..

జయరాం హత్యకేసు మరో మలుపు..
x
Highlights

కోస్టల్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌, ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసు మరో మలుపు తిరిగింది. కేసు విచారణలో భాగంగా జయరాం భార్య పద్మశ్రీ...

కోస్టల్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌, ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసు మరో మలుపు తిరిగింది. కేసు విచారణలో భాగంగా జయరాం భార్య పద్మశ్రీ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసినట్లు సమాచారం. ఈ కేసులో జయరాం బంధువులపైనే అనుమానాలున్నాయని అతని పద్మశ్రీ ఆరోపించారు. 2016 నుంచి ప్రాణాపాయం ఉందని జయరాం తనతో చెప్పేవారని.. అమెరికా నుంచి భారత్‌కు వచ్చాక ఇంత ఘోరంగా చంపుతారని ఊహించలేదని పద్మశ్రీ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. కంపేనీ పనుల మీదే జయరాం అమెరికా నుంచి భారత్‌ వచ్చారని ఆమె చెప్పారు. సొంత అక్కతోనే తనకు ప్రాణహాని ఉందని జయరాం తనకు పలుమార్లు చెప్పేవారని పద్మశ్రీ పోలీసులకు చెప్పారు. కాగా మేనకోడలు శిఖా చౌదరి ప్రమేయం ఎక్కువ కావడంతోనే ఆమెను ఓ న్యూస్ ఛానల్‌ బాధ్యతల నుంచి తప్పించినట్లు పోలీసులకు పద్మశ్రీ తెలిపినట్టు తెలుస్తోంది.

మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాకేశ్‌రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో అతడు పోలీసులకు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. 'జయరామ్‌కు మెదక్‌లో ఓ కంపెనీ ఉంది.. ఆ కంపెనీ ఉద్యోగులు జీతం అందక గొడవ చేస్తున్న సమయంలో రెండేళ్ల కిందట తన వద్ద రూ. 4.50 కోట్ల అప్పు తీసుకున్నట్టు. ఆ సమయంలోనే జయరామ్‌ మేనకోడలు శిఖాచౌదరి పరిచయం అయిందని.. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని.. అయితే శిఖా చౌదరిని వదిలేయాలని జయరామ్‌ నన్ను కోరాడు. నాకు ఇవ్వాల్సిన 4.50 కోట్లతో పాటు శిఖాకి ఖర్చు పెట్టిన కోటి రూపాయలు ఇస్తే వదిలేస్తానని చెప్పానని పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఆ డబ్బును ఎన్నిరోజులకు ఇవ్వకపోవడంతో తీవ్రస్థాయిలో బెదిరించానని.. దీంతో జనవరి 31వ తేదీన ఉదయం అతడు ఒంటరిగా మా ఇంటికి వచ్చాడని.. తన ఇంట్లో నుంచే పలువురికి జయరాం ఫోన్‌ చేసి డబ్బు సర్దుబాటు చేయాలనీ కోరాడు.. జయరాం బ్యాంకులో పనిచేసే ఓ మాజీ ఉద్యోగి ద్వారా రూ. 6 లక్షలు నా స్నేహితులకు అందజేశాడు. రూ.5.5 కోట్లకు గానూ కేవలం 6 లక్షలు ఇవ్వడమేంటని జయరామ్‌తో వాదనకు దిగానని. ఈ క్రమంలో జయరాంపై పిడిగుద్దులు గుద్దడంతో జయరామ్‌ హార్ట్‌ పేషెంట్‌ కావడం వలన ఆ దెబ్బలకే చనిపోయినట్టు.. ఆ తరువాత బీరును కొనుగోలు చేసి జయరాం నోటిలో పోసినట్టు.. రాకేష్ పోలీసుల విచారణంలో అంగీకరించినట్టు తెలుస్తోంది. కాగా ఈ కేసులో నిందితులను ఇవాళ మీడియా ముందు హాజరుపరిచే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories