Top
logo

ప్రముఖ జానపద నృత్య కళాకారుడు క్వీన్ హరీష్ మృతి

ప్రముఖ జానపద నృత్య కళాకారుడు క్వీన్ హరీష్ మృతి
X
Highlights

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రాజస్థాన్ నాట్య కళాకారుడు క్వీన్ హరీష్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసారు. రాజస్తాన్...

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రాజస్థాన్ నాట్య కళాకారుడు క్వీన్ హరీష్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసారు. రాజస్తాన్ జైసల్మేర్ కు చెందిన హరీష్ కుమార్ క్వీన్ హరీష్ గా ప్రసిద్ధిపొందారు. ఈయన రాజస్థానీ జానపద నృత్యాలైన ఘూమార్,కల్బెలియ,చాంగ్, భావై, చారి వంటి నృత్యరీతులలో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. జోద్ పూర్ జాతీయ రహదారిపై కపర్డా గ్రామం దగ్గరలో ఈ రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అజ్మీర్ నుంచి జైసల్మార్ వైపుగా వీరు ప్రయాణిస్తున్న ఎస్యూవీ వాహనం ఆగి ఉన్న ట్రక్ ను బలంగా డీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న హరీష్, రవీంద్ర, భికే ఖాన్, లతీఫ్ ఖాన్ నలుగురు మృతి చెందారు. వీరంతా ఓ నృత్య ప్రదర్శనకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు ప్రమాదస్తాలానికి చేరుకున్నారని బిలారా పొలీస్ స్టేషన్ అధికారి సీతారాం ఖోజా తెలిపారు.

రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ హరీష్ , ఇతర కళాకారుల మృతి పట్ల తన సంతాపాన్ని తెలిపారు.


Next Story