పుల్వామా ఉగ్రదాడి ఇతగాడి పనే.. పెంచి పోషిస్తున్న చైనా..

పుల్వామా ఉగ్రదాడి ఇతగాడి పనే.. పెంచి పోషిస్తున్న చైనా..
x
Highlights

పుల్వామా ఉగ్రదాడి తమ పనేనంటూ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్‌ అజార్‌ ఈ దాడికి వ్యూహరచన చేశాడు....

పుల్వామా ఉగ్రదాడి తమ పనేనంటూ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్‌ అజార్‌ ఈ దాడికి వ్యూహరచన చేశాడు. గతంలో అజార్‌ను కేంద్రం అరెస్ట్‌ చేసినా..1999లో ఇండియన్‌ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని హైజాక్‌ చేసి... మరీ ఇతన్ని విడిపించుకున్నారు ఉగ్రవాదులు. ఆ తరువాత జైష్‌ ఏ మహమ్మద్‌ ఉగ్రసంస్థను నెలకొల్పాడు. కశ్మీర్‌ను భారత్‌ నుంచి విడగొట్టాలన్న కుట్రతో అనేక ఉగ్రదాడులను నిర్వహించాడు. వందల మంది జవాన్ల మరణాలకు కారణమయ్యాడు. పార్లమెంటుపై ఆత్మాహుతి దాడి, పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి, ఉరీ సైనికస్థావరంపై దాడి.. ఇలా పలు ఉగ్రవాద కార్యకలాపాల్లో మసూద్‌దే కీలక పాత్ర. కాగా ఈ కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్‌ అజార్‌కు... చైనా మద్దతు ఇస్తోంది.












ఐక్యరాజ్యసమితిలో అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదనను భద్రతామండలిలో శాశ్వత సభ్యదేశంగా ఉన్న చైనా అనేక సార్లు అడ్డుకుంది. 2001 పాక్‌లోని ఉగ్రవాదులకు ఆ దేశ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా చైనా కూడా అండగా నిలబడింది. చైనా, పాక్‌ ఆర్థిక నడవాకు చైనా భారీ నిధులు సమాకూరుస్తోంది. భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌ కేంద్రంగా ఉన్న ఉగ్రవాద శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోంది. అంతర్జాతీయంగా భారత్.. చైనాకు ప్రత్యామ్నాయం కాకూడదన్న దురుద్దేశ్యంతోనే ఇలాంటి ఉగ్రవాదులను చైనా పెంచి పోషిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. చైనా అండతో.... మసూద్‌ అజార్‌ రోజురోజుకు రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు పుల్వామాలో ఉగ్రదాడికి స్కెచ్‌ వేసి.... ఏకంగా 44 మంది జవాన్లను పొట్టబెట్టుకున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories