Top
logo

సాప్ట్‌వేర్ భర్త అరాచకం.. భార్యను వివస్త్రను చేసి..

సాప్ట్‌వేర్ భర్త అరాచకం.. భార్యను వివస్త్రను చేసి..
X
Highlights

ఇంట్లోనే రహస్య కెమేరాలు ఏర్పాటు చేసి తన భార్యను అతి బలవంతంగా నగ్నంగా వీడియోసి తీసి వికృతంగా వ్యవహరించాడో ఓ భర్త. కాగా బాధితురాలి తలిదండ్రుల ఫిర్యాదు మేరకు మొత్తానికి రామమూర్తినగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది.

ఇంట్లోనే రహస్య కెమేరాలు ఏర్పాటు చేసి తన భార్యను అతి బలవంతంగా నగ్నంగా వీడియోసి తీసి వికృతంగా వ్యవహరించాడో ఓ భర్త. కాగా బాధితురాలి తలిదండ్రుల ఫిర్యాదు మేరకు మొత్తానికి రామమూర్తినగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రదీప్ మోసర్తి బెంగళూరులో సాప్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గత మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన అనూపమతో పెళ్లి జరిగింది. పెళ్లి కింద కట్నంగా రూ. 15లక్షలు, 12 తులలా బంగారం పెట్టారు. వివాహం అనంతరం వీరిరవురు బెంగళూరులోని రామమూర్తినగర్ అన్న పూర్ణేశ్వరి లేఅవుట్‌లో నివాసం ఉంటున్నారు. కాగా కొద్ది రోజులు గడిచిన తరువాత నుండి విపరింతంగా డబ్బుపై మోజు పట్టుకుంది ప్రదీప్‌కు ఇక అప్పటి నుండి అనూపను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. అదనపు కట్నం తీసుకురావలని అనూపను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. కాగా అనూప బంధువులు తమ ఇంటికి వస్తే ఒక్కపూట కూడా ఉండనిచ్చే వాడు కాదు. ఇక విసిగిపోయిన అనూప తలిదండ్రులు రూ. 5లక్షలు తెచ్చిఇచ్చారు. పైసలు ముట్టిన తరువాత కొద్దిరోజులు బాగానే ఉన్నారు. మళ్లీ కొద్ది రోజుల తరువాత ఇదే బాగోతం మొదలుపెట్టాడు. ఇక దీంతో అనూప తలిదండ్రులు పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రదిప్ బాగోతం బట్టబయిలు చేశారు. అసలు ఇతను ఇంతముందే వివాహం చేసుకున్నాడని అతని మొదటి భార్యను కూడా ఇలానే వేధించేవాడని వెల్లడించారు. కాగా ఈ విషయం దాచి అనూపను వివాహం చేసుకున్నాడని తెలిపారు. చివరకు సైకో ప్రదీప్‌ను స్థానికుల సహయంతో పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు.

Next Story