Bengaluru Fridge Horror : బెంగళూరు మహిళ హత్యకేసు నిందితుడు ఆత్మహత్య

Bengaluru Fridge Horror :కర్నాకటలోని బెంగళూరులో మహిళను అత్యంత దారుణంగా హత్యచేసి డెడ్ బాడీని ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో పెట్టిన ఘటన దేశాన్ని కదిలించింది. ఈకేసులో నిందితుడు ఒడిశాలో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 Sept 2024 7:05 AM IST
Police identifies womans colleague as prime suspect in murder full details
X

Bengaluru Fridge Horror : బెంగళూరు మహిళ హత్యకేసు నిందితుడు ఆత్మహత్య

Bengaluru Fridge Horror : కర్నాటక రాజధాని బెంగళూరులోని ఓ ఇంట్లో మహాలక్ష్మీ అనే మహిళను దారుణంగా హత్య చేశాడో వ్యక్తి. ఆ తర్వాత ఆమె డెడ్ బాడీని ముక్కులుగా నరికి ఫ్రిజ్ లో పెట్టాడు. ఈ కేసును కర్నాటక ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ దారుణ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఒడిశాలో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడు ముక్తిరాజన్ ప్రతాప్ రాయ్ సూసైడ్ చేసుకున్నాడని సెంట్రల్ బెంగళూరు డిప్యూటీ కమిషనర్ శేఖర్ తెలిపారు. అంతకుముందు రోజు కర్నాటక హోం మంత్రి పరమేశ్వర ఒడిశాలో నిందితుడి ఉనికి గుర్తించినట్లుగా పోలీసులకు సమాచారం వెళ్లిందని చెప్పారు. అతనిని పట్టుకునేందుకు పోలీసులను పంపించినట్లు వెల్లడించారు. ఈ హత్య కేసును చాలా సీరియస్ తీసుకున్నామని పరమేశ్వర విలేకరులతో తెలిపారు. ప్రతాప్ రాయ్ ను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారని..ఒడిశాలోని పలు ప్రాంతాలకు పారిపోయిన నిందితుడి కదలికలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

అయితే అంతకుముందు కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు హోంమంత్రి తెలిపారు. కాగా పలు సాక్ష్యాధారాల ఆధారంగా ప్రతాప్ రాయ్ ప్రాథమిక నిందితుడిగా గుర్తించారు. బాధితురాలి నుంచి దూరంగా ఉంటున్న భర్త కూడా సమీపంలో నివసించే మాలక్ష్మికి తెలిసిన వ్యక్తిపైనే అనుమానాలు వ్యక్తం చేశాడు.

మహాలక్ష్మీని హత్య చేసిన ముక్తిరాజన్ ప్రతాప్ రాయ్ స్వగ్రామానికి వెళ్లి తర్వాత చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మహాలక్ష్మీ మరణానికి ముందు విష ప్రయోగం జరిగిందో లేదో అని రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ఫ్రిజ్ మీదున్న వేలి ముద్రలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ కేసులో ప్రతాప్ రాయ్ తో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు.

మహాలక్ష్మీ హత్య దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 2022లో ఢిల్లీకి చెందిన శ్రద్ధా వాకర్ కేసును పోలి ఉండటం..అక్కడ బాధితురాలు కూడా ముక్కలు చేసి ఆమె డెడ్ బాడీ రిఫ్రిజిరేటర్ లో పెట్టాడు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story