logo

కల్పన మృతదేహం వెలికితీత!

కల్పన మృతదేహం వెలికితీత!
Highlights

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లోని బావి నుంచి పదకొండేళ్ల కల్పన మృతదేహాన్ని పోలీసులు...

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లోని బావి నుంచి పదకొండేళ్ల కల్పన మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన వ్యవసాయ బావిలో పోలీసులు వెతకగా కల్పన ఆస్తికలు బయటపడ్డాయి. 2015లో కల్పనపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు శ్రీనివాస్‌రెడ్డి పోలీసులకు చెప్పాడు. ఇప్పటికే శ్రావణి, మనీషా మృతదేహాలు అదే బావిలో లభించిన సంగతి తెలిసిందే.

సైకోగా మారి అమ్మాయిలను రేప్ చేసి దారుణంగా చంపినట్టు పోలీస్ విచారణలో శ్రీనివాసరెడ్డి అంగీకరించాడు. నెలన్నర క్రితం డిగ్రీ విద్యార్థిని మనీషాపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు అతను ఒప్పుకున్నాడు. ఈ నెల 25న స్కూల్‌కు వెళ్లి వస్తున్న బాలిక శ్రావణిపై కూడా అత్యాచారానికి పాల్పడి.. ఆ తర్వాత హత్య చేసినట్లు శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించాడు. ముగ్గురినీ పాడుపడిన బావిలో పాతిపెట్టినట్టు తెలిపాడు.

లైవ్ టీవి

Share it
Top