Top
logo

సోషల్ మీడియాలో వదంతులు:పది మంది అరెస్ట్

సోషల్ మీడియాలో వదంతులు:పది మంది అరెస్ట్
X
Highlights

సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలపై పది మందిని రామగుండం పోలీసులు అరెస్ట్ చేశారు. రామగుండం...

సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలపై పది మందిని రామగుండం పోలీసులు అరెస్ట్ చేశారు. రామగుండం పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయన ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, సైబర్ క్రైమ్ పోలీసులు ఈ అరెస్టులు చేశారు. హంతకుల ముఠా ఒకటి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిందంటూ వీరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. మంచిర్యాల కోర్ట్ కాంప్లెక్ నివాసి అన్నం రమేష్, బెల్లంపల్లికి చెందిన జవాజి సత్యనారాయణ, గోదావరిఖని చెందిన సొల్లు శ్రీనివాస్, పెద్దపల్లి లోని దేవుని పెళ్లికి చెందిన పంజా శ్రీనివాస్, బన్నీ సతీష్ కుమార్, సొన్నల నరేష్ లతో పాటు, కణాలకు చెందిన వేజ్జిలపు నరేష్, గోదావరి ఖనికి చెందిన బత్తుల రవి, ముత్తారం కు చెందిన భోగం విజయ్ అరెస్టు అయినా వారిలో ఉన్నారు.

Next Story