Top
logo

బండ్ల గణేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన పీవీపీ

బండ్ల గణేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన పీవీపీ
X
Highlights

బండ్ల గణేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన పీవీపీ బండ్ల గణేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన పీవీపీ

నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్‌పై పోలీస్ కేసు నమోదు అయింది. వైఎస్సార్‌ సీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ)ను బండ్ల గణేష్‌ తన అనుచరులతో కలిసి గతరాత్రి బెదిరింపులకు పాల్పడ్డాడని పీవీపీ జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో బండ్ల గణేష్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. గతంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన 'టెంపర్‌' చిత్రానికి బండ్ల గణేష్‌ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఆ చిత్రానికి పీవీపీ రూ.7 కోట్లు ఫైనాన్స్‌ చేసినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో రావలసిన సొమ్మును తిరిగి చెల్లించమని పీవీపీకి అడుగుతునట్టు ఆయన చెప్పారు. ఈ క్రమంలో శుక్రవారం అర్థరాత్రి దాటాక తన నివాసంపై బండ్ల గణేష్‌ మనుషులు కొంతమంది బెదిరింపులకు పాల్పడినట్టు పీవీపీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో ఐపీసీ సెక్షన్ 448, 506, రెడ్‌విత్‌ 34 కింద బండ్ల గణేష్‌తో పాటు నలుగురిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బండ్ల గణేష్‌ అందుబాటులో లేనట్టు తెలుస్తోంది.Next Story