Top
logo

108లో ఆక్సిజన్‌ లేక రోగి మృతి

108లో ఆక్సిజన్‌ లేక  రోగి మృతి
X
Highlights

108లో ఆక్సిజన్‌ అంధక రోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో జరిగింది. పిఠాపురం...

108లో ఆక్సిజన్‌ అంధక రోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో జరిగింది. పిఠాపురం పట్టణం ఇందిరా కాలనీకి చెందిన కూరపాటి చిన గంగరాజుకు భార్య చింతాలమ్మ, ఇద్దరు కుమారులున్నారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల కోలుకున్నాడు. అయితే శుక్రవారం తెల్లవారుజామున సడన్ గా గంగరాజు ఊపిరి ఆడక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో 108 కి ఫోన్ చేసి రప్పించారు. ఆక్సిజన్ పెట్టాల్సిందిగా కుటుంబసభ్యులు కోరినా అందులో రెగ్యులేటర్‌ పనిచేయకపోవడంతో అతనికి ఆక్సిజన్ అందలేదు. దీంతో గంగరాజు మార్గంమధ్యలో మృతిచెందాడు. 108 వాహనంలో ఆక్సిజన్‌ అందివుంటే అతను మృతిచెందేవాడు కాదని కుటుంబసభ్యులు రోధించారు.

Next Story