పెళ్లికి ముందే బలవతంగా కాపురం..చివరికి..

పెళ్లికి ముందే బలవతంగా కాపురం..చివరికి..
x
Highlights

ఇప్పుడే పెళ్లి వద్దు.. చదువుకుంటానంటూ ఓ బిడ్డ మొరపెట్టుకున్నా మూర్ఖత్వంతో వ్యవహరించాడు బాధ్యతగల తండ్రి. పదో తరగతి చదువుకున్న బిడ్డను ఇంటర్మిడియట్ లో...

ఇప్పుడే పెళ్లి వద్దు.. చదువుకుంటానంటూ ఓ బిడ్డ మొరపెట్టుకున్నా మూర్ఖత్వంతో వ్యవహరించాడు బాధ్యతగల తండ్రి. పదో తరగతి చదువుకున్న బిడ్డను ఇంటర్మిడియట్ లో చేర్పించకుండా పెళ్లి చేయకూడని వయస్సులో వివాహం జరిపించాలనుకున్నారు. మైనర్ బాలిక అని కూడా చూడకుండా అప్పటికే పెళ్లైన వ్యక్తితో వివాహ నిశ్చితార్ధం చేశారు. పెళ్లికి ముందే బలవతంగా కాపురం చేయించారు తల్లిదండ్రులు. పెళ్లి ఆపి వేసి చదువుకునే అవకాశం కల్పించాలని బాలిక ఇతరుల సాయంతో అధికారులను వేడుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. బాలిక గర్భం దాల్చింది.

సంగారెడ్డి పట్టణానికి చెందిన పదహారేళ్ల బాలికకు మూడు నెలల క్రితం తల్లిదండ్రులు నిశ్చితార్ధం చేశారు. పెళ్లి ఇష్టం లేదని ఆపించాలని బాలిక తెలిసిన వారి సాయంతో మహిళా, శిషు సంక్షేమ అధికారులకు విన్నవించింది. బాలిక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పెళ్లి చేయవద్దని హెచ్చరించారు. అయినా అధికారుల హెచ్చరికను లెక్క చేయని ఆ తల్లిదండ్రులు బిడ్డకు పెళ్లయిన వ్యక్తితో నిశ్చితార్థం జరిపి కాపురం చేయించారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం అధికారుల అలసత్వంతో అమాయకురాలిని గర్భవతిని చేశాయి. బాలిక జివితం చిన్నా భిన్నం చేసింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు అబార్షన్ చేయించారు. బాధ్యుడైన వ్యక్తితో పాటు బాలిక కుటుంబానికి చెందిన నలుగురిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్టు చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories