logo

జనసేన బహిరంగసభలో అపశ్రుతి

జనసేన బహిరంగసభలో అపశ్రుతి

జనసేన ఎన్నికల ప్రచార సభలో అసశ్రుతి చోటుచేసుకుంది. శుక్రవారం కర్నూలు జిల్లా నంద్యాలలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సభకు ఏర్పాటు చేసిన మైక్‌ సౌండ్‌ సెట్‌ తల మీద పడటంతో సిరాజ్‌ అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.

హుటాహుటిన అతడిని స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే సిరాజ్‌ మృతిచెందినట్టు తెలుస్తోంది. దీంతో సభా ప్రాంగణం వద్ద గందరగోళం నెలకొంది. కాగా మృతుడు సిరాజ్‌ కు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే కుమార్తె అంగవైకల్యంతో బాధపడుతోంది.

లైవ్ టీవి

Share it
Top