దారుణం..కూలీ డబ్బులు అడిగితే వేళ్ళు కోసేశారు!

దారుణం..కూలీ డబ్బులు అడిగితే వేళ్ళు కోసేశారు!
x
Highlights

అతనో నిరుపేద వృద్ధుడు. ఓడిశాలో మారుమూల ప్రాంతంలో ఉంటాడు. వేరే ప్రాంతంలో కూలి పనులు చేసుకుంటే, డబ్బులు వస్తాయి.. తిండి దొరుకుతుందని భావించాడు. ఈ...

అతనో నిరుపేద వృద్ధుడు. ఓడిశాలో మారుమూల ప్రాంతంలో ఉంటాడు. వేరే ప్రాంతంలో కూలి పనులు చేసుకుంటే, డబ్బులు వస్తాయి.. తిండి దొరుకుతుందని భావించాడు. ఈ క్రమంలో అతనికి మంచి పని ఇప్పిస్తామని చెప్పి నాగపూర్ తీసుకువెళ్ళారు కొందరు. అక్కడ ఒక నిర్మాణ కంపెనీలో పని ఇప్పించారు. కొంతకాలం తరువాత తన కూలీ డబ్బులు ఇప్పించమని వారిని అడిగాడు. దాంతో వారు అతనిని దారుణంగా కొట్టి.. చేతి వెళ్ళను నరికేశారు.

ఆలస్యంగా వెలుగు చూసిన ఈ హృదయవిదారక దారుణం నాగపూర్ లో జరిగింది. 60 ఎల్లా వయసున్న చమ్రూ పహరియాకు పని కల్పిస్తామని నాగపూర్ తీసుకువచ్చిన దొందగులు.. పని చేయించి.. కూలీ డబ్బులు అడిగినందుకు డోలాల్‌ సట్నామి, బిడేసి సునామి అనే ఇద్దరు వ్యక్తులు అతనిపై దాడికి దిగారు. చమ్రూను దారుణంగా కొట్టడమే కాకుండా.. కుడి చేతి మూడు వేళ్లను, కుడి కాలి ఐదు వేళ్లను పదునైన ఆయుధంతో కత్తిరించారు.

ఈ దాడి అనంతరం భయంతో చమ్రు తన సొంతూరు వెళ్లేందుకు నాగ్‌పూర్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. అయితే గాయాలతో ఉన్న చమ్రూను గుర్తించిన రైల్వే పోలీసులు అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత చమ్రూ కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో అతన్ని తిరిగి వారి ఊరికి తీసుకెళ్లారు. దిలీప్‌కుమార్‌ అనే ఉద్యమకారుడు చమ్రూకు న్యాయం చేయాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించాడు. అలాగే చమ్రూ కుటుంబానికి తగిన పరిహారం చెల్లించేలా అధికారులను ఆదేశించాలని కోరాడు. ఈ ఘటనపై చమ్రూ కుమారుడు తులరామ్‌ మాట్లాడుతూ.. 'మా కుటుంబానికి వారు తీవ్ర అన్యాయం చేశారు. మా నాన్న తన పనులు కూడా తాను చేసుకోలేపోతున్నాడు. కనీసం చేతులతో ఏ వస్తువును కూడా పట్టుకోలేకపోతున్నాడ'ని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈ ఘటనపై మాట్లాడేందుకు చమ్రూ మాత్రం భయపడుతున్నాడు. మరోవైపు చమ్రూపై దాడికి దిగిన వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories