Top
logo

పలు కోణాల్లో శ్రీనివాస్ ను విచారిస్తున్న ఎన్‌ఐఏ బృందం

పలు కోణాల్లో శ్రీనివాస్ ను విచారిస్తున్న ఎన్‌ఐఏ బృందం
X
Highlights

ఏపీ ప్రతిపక్ష నేత వైెఎస్ జగన్ మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్య యత్నం కేసు విచారణను ఎన్ఐఏ ముమ్మరం చేసింది. ఈ కేసులో...

ఏపీ ప్రతిపక్ష నేత వైెఎస్ జగన్ మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్య యత్నం కేసు విచారణను ఎన్ఐఏ ముమ్మరం చేసింది. ఈ కేసులో ఏకైక నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు నుంచి సమాచారం రాబట్టేందుకు అధికారులు పలు కోణాల్లో విచారిస్తున్నారు. విశాఖలో రెండో రోజు నిందితుడిని విచారించిన అధికారులు ... కీలక సమాచారం కోసం హైదరాబాద్ తరలించాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేక వాహనంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య విశాఖ ఎయిర్ పోర్టుకు నిందితుడిని తీసుకొచ్చారు.

నిందితుడి తరపు లాయర్‌ అబ్దుల్‌ సలీమ్‌ను విశాఖబక్కన్నపాలెం సీఆర్పీఎఫ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు రావాలని సూచించారు. అయితే ఇక్కడ అధికారులు ఎలాంటి విచారణ జరపలేదని న్యాయవాది సలీమ్‌ మీడియాకు తెలిపారు. శ్రీనివాసరావును విచారించేందుకు బక్కన్నపాలెంలోని సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్ సరైన ప్రాంతం కాదని అధికారులు భావిస్తున్నట్లు చెప్పారు.

Next Story