అనుహ్య మలుపు తిరిగిన రామ్ ప్రసాద్ హత్య కేసు

అనుహ్య మలుపు తిరిగిన రామ్ ప్రసాద్ హత్య కేసు
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టియించిన పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసు మరో మలుపు తిరిగింది. నిందితులు కోసం ఓ వైపు పోలీసులు గాలిస్తుంటే , మరో...

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టియించిన పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసు మరో మలుపు తిరిగింది. నిందితులు కోసం ఓ వైపు పోలీసులు గాలిస్తుంటే , మరో వైపు తామే హత్య చేశామంటూ ముగ్గురు వ్యక్తులు మీడియా ముందుకు వచ్చారు . పాత గొడవలతోనే రాంప్రసాద్ ను హత్య చేశామన్నారు. మొదటి నుండి ఈ హత్య కేసులో కోగంటి సత్యం ప్రమేయం ఉందని భావిస్తున్న నేపథ్యం లో హఠాత్తుగా ముగ్గురు వ్యక్తులు తామే హత్య చేశాం అంటూ ఒప్పుకోవడం వెనుక అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

హైదరాబాద్ నడిబొడ్డున పారిశ్రామికవేత్త రాంప్రసాద్ మర్డర్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. శనివారం రాత్రి 8 గంటలకు పంజాగుట్టలో రాంప్రసాద్ ను ముగ్గురు వ్యక్తులు వెంటాడి కత్తులతో పొడిచి చంపారు. రామ్ ప్రసాద్ హత్య వెనుక వ్యాపారవేత్త కోగంటి సత్య హస్తం ఉందని మృతుడి కుటుంబీకులు ఆరోపించగా, ఆ దిశలో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుల కోసం పోలీసులు గాలిస్తుండగా, రాంప్రసాద్‌ని తామే హత్య చేశామంటూ శ్యామ్ అనే వ్యక్తి, మరో ఇద్దరు వ్యక్తులు మీడియా ముందుకు వచ్చారు. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా రామ్ ప్రసాద్ తప్పుడు కేసులు పెట్టారని, ఆ కక్షతోనే హత్య చేశానని శ్యామ్ తెలిపాడు. రాంప్రసాద్ అల్లుడు శ్రీనివాస్ కూడా హత్య చేస్తే 15 లక్షలు డబ్బులు ఇస్తానని గతం లో చెప్పినట్లు తెలిపాడు..ఈ కేసులో శ్యామ్‌తో పాటు మరో ఇద్దరు చోటూ, నరేష్‌ నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఈ కేసులో పోలీసులు ముందు లొంగిపోయిన శ్యామ్ భార్య వరలక్ష్మి మీడియా తో మాట్లాడింది. రాంప్రసాద్ ను హత్య చేసింది తన భర్తేనన్న విషయం తనకు తెలియదు అంది. అయితే, గతంలో రాంప్రసాద్ పెట్టిన కేసులు తో తాము విసిగిపోయాం అని ఆవేదన వ్యక్తం చేసింది. కోగంటి సత్యం సహకారం తో వ్యాపారం చేసుకుంటున్నాం తప్ప , అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. మరో వైపు రామ్ ప్రసాద్ హత్య కేసులో మొదట్లో నిందితుడిగా భావించిన కోగంటి సత్యం అజ్ఞాతంలో నుంచి మీడియా ముందుకు వచ్చారు. తనకు రామ్ ప్రసాద్ నుంచి ఐదు కోట్ల రూపాయలు రావాల్సి ఉందని, అతడికి హత్య చేస్తే తన డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. మృతుడి కుటుంబీకుల ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఈ కేసులో కోగంటి సత్యం తప్పించుకోవడం కోసం శ్యామ్ తో డ్రామా కి తెర లేపారా ? లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణం లో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories