Nellore Crime: నెల్లూరులో దారుణం గర్భిణి భార్యపై కత్తితో దాడి ..14 సార్లు పొడిచిన భర్త

Nellore Crime: నెల్లూరులో దారుణం గర్భిణి భార్యపై  కత్తితో దాడి ..14 సార్లు పొడిచిన భర్త
x

Nellore Crime: నెల్లూరులో దారుణం గర్భిణి భార్యపై కత్తితో దాడి ..14 సార్లు పొడిచిన భర్త

Highlights

నెల్లూరు జిల్లాలో అనుమానంతో గర్భిణి భార్యపై భర్త 14 సార్లు కత్తితో దాడి. తీవ్ర గాయాలతో బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Nellore Crime: నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. గర్భిణి అయిన బాధితురాలిపై 14 సార్లు కత్తితో పొడిచినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ ఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం విశ్వనాథరావుపేటలో బుధవారం రాత్రి జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం, బిట్రగుంటలో నివసిస్తున్న రైల్వే శాఖ సహాయ లోకో పైలట్ ఎం. వెంకటశేషగిరిరావు మొదటి భార్య మరణించిన తర్వాత వివాహ వేదిక ద్వారా అనకాపల్లి జిల్లాకు చెందిన కరుణను రెండో వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా దంపతుల మధ్య వివాదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.

భార్యపై అనుమానం పెంచుకున్న నిందితుడు ఆగ్రహంతో కత్తితో దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలతో కుప్పకూలిన బాధితురాలిని స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా కావలి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories