Top
logo

అన్నవరంలో అనుమానాస్పదంగా తల్లీ బిడ్డల మృతి!

అన్నవరంలో అనుమానాస్పదంగా తల్లీ బిడ్డల మృతి!
X
Highlights

తన కష్టానికి చావే ముగింపు అని ఆ తల్లి అనుకుందో ఏమో.. తమ కోడలిని చంపేద్దామని అత్తమామలే ఏదైనా అఘాయిత్యానికి...

తన కష్టానికి చావే ముగింపు అని ఆ తల్లి అనుకుందో ఏమో.. తమ కోడలిని చంపేద్దామని అత్తమామలే ఏదైనా అఘాయిత్యానికి ఒడికట్టారో కానీ.. ఆంధ్రప్రదేశ్ తూర్పగోదావరి జిల్లా అన్నవరం లో ఓ తల్లీ.. ఇద్దరు చిన్నారులు విషాహారం తిని దుర్మరణం పాలయ్యారు. సోమవారం చోటు చేసుకున్న ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

సంఘటన ఎలా జరిగిందనే దానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భర్త, అత్తామామలే కారణమంటూ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో [పోలీసులు ఆ దిశలోనే తమ దర్యాప్తును మొదలు పెట్టారు.

విశాఖజిల్లా నాతవరం మండలం కె.నాయుడుపాలెం గ్రామానికి చెందిన సుష్మ రాజ్యలక్ష్మి కి అన్నవరం గ్రామానికి చెందిన రమేష్ తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి బాబు (దీపు,6) తొమ్మిది నెలల చంటి బాబు ఉన్నారు. ఇటీవలి కాలంలో తమ కుమార్తెను అత్తమామలు ఆస్తి కోసం వేధించారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. అందుకోసమే తమ కుమార్తెను, చిన్న పిల్లలనూ హత్య చేశారని వారు అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story