పింఛన్‌ డబ్బు కోసం తండ్రిపై కొడుకు దాడి.. చికిత్స పొందుతూ మృతి

పింఛన్‌ డబ్బు కోసం తండ్రిపై కొడుకు దాడి.. చికిత్స పొందుతూ మృతి
x
Highlights

పున్నామ నరకం నుంచి తప్పించడమేమోగానీ బతికున్న తండ్రికి నరకం చూపించాడా కొడుకు. పెన్షన్‌ డబ్బుల కోసం కన్నతండ్రిపైనే దాడికి తెగబడ్డాడో ప్రబుద్ధుడు. వద్దని...

పున్నామ నరకం నుంచి తప్పించడమేమోగానీ బతికున్న తండ్రికి నరకం చూపించాడా కొడుకు. పెన్షన్‌ డబ్బుల కోసం కన్నతండ్రిపైనే దాడికి తెగబడ్డాడో ప్రబుద్ధుడు. వద్దని బతిమలాడిన వినకుండా గొడ్డును బాదినట్లు బాదిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చేసింది. తండ్రిని కొడుకు చంపేందుకు ప్రయత్నిస్తుండగా కుటుంబ సభ్యులు వీడియో తీయడంతో ఈ దారుణం బయటపడింది.

బంధాలు, అనుబంధాలు మరిచిపోయి కేవలం ఫించన్‌ డబ్బులు అడిగితే ఇవ్వడం లేదన్న కోపంతో మద్యం మత్తులో తండ్రిపై దాడి చేయడమేకాక అతని గొంతు నులిమి హత్యా యత్నం చేశాడు. తీవ్రంగా గాయపడి ఆపస్మారక స్థితికి చేరుకున్న వృద్ధుడిని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ నిన్న చనిపోయాడు. కృష్ణా జిల్లా చందర్లపాడులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

చందర్లపాడు గ్రామానికి చెందిన షేక్‌ మహబూబ్‌సాహెబ్‌ కూలి పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు.ఈనెల 8వ తేదీన ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్‌ కింద అందించిన 2,250 రూపాయలు తీసుకుని ఇంటికి వచ్చాడు. అదే రోజు రాత్రి అతని రెండో కొడుకు సిలార్‌సాహెబ్‌ పూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. తండ్రిని డబ్బు కోసం అడిగాడు. అతను ఇవ్వడానికి నిరాకరించడంతో బక్కచిక్కిన తండ్రిపై దాడి చేశాడు. పిడిగుద్దులు కురిపిస్తూ గొంతును నులిమే ప్రయత్నం చేశాడు. తండ్రీ-కొడుకుల మధ్య కాసేపు పెనుగులాట జరిగింది.

వెంటనే కొడుకు శిలార్ తండ్రిని చేతులతో ఎత్తుకెళ్లి ఇంటి బయట పడేసే ప్రయత్నం చేశాడు. అది కుదరకపోవడంతో మళ్లీ ఇంట్లోకి తీసుకొచ్చి చంపే ప్రయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు వారించినా వినిపించుకోకుండా దాడి చేశాడు. తర్వాత స్థానికులంతా రావడంతో.. తండ్రిని అక్కడే వదిలేశాడు. శిలార్ చేతిలో గాయపడ్డ మహబూబ్‌ అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ నిన్న చనిపోయాడు. మృతుడి పెద్ద కుమార్తె మస్తాన్‌బీ ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories