బాలీవుడ్ నటితో వ్యభిచారం ... రెడ్ హ్యాండెడ్‎గా పట్టుకున్న పోలీసులు

బాలీవుడ్ నటితో వ్యభిచారం ... రెడ్ హ్యాండెడ్‎గా  పట్టుకున్న పోలీసులు
x
Highlights

ముంబైలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార దందా గుట్టురట్టు పోలీసులు చేశారు. బాలీవుడ్ సినీనటితో వ్యభిచారం చేయుస్తున్న మహిళను ముంబై పోలీసులు అరెస్టు చేశారు.

ముంబైలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార దందాను పోలీసులు గుట్టురట్టు చేశారు. బాలీవుడ్ సినీనటితో వ్యభిచారం చేయుస్తున్న మహిళను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముంబైకి చెందిన షిపాంజలిరావు అనే మహిళ కొన్ని రోజులుగా సినీనటులు, మోడళ్లతో వ్యభిచారం చేయిస్తోంది.

చిన్న సినిమాల్లో పాత్రలు చేసిన నటి ఆఫర్లు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. ఈ విషయం తెలుసుకున్న షిపాంజలి ఆమెను సంప్రదించి వ్యభిచారంతో ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కవచ్చని నమ్మబలికి ఆమెను ఒప్పించింది. కొందరి విటులను ఆ నటి దగ్గరకు పంపించేది.

పక్క సమాచారం అందుకున్న ఓషివారా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ఓ ‎కస్టమర్‌ను ఆమె వద్దకు పంపారు. సినీ నటితో గడపాలని కోరడంతో షిఫాంజలి అతని దగ్గర 20వేల రూపాయిలు తీసుకుని నటి వద్దకు పంపించింది. దీంతో వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. నటిని రక్షించి సంరక్షిత కేంద్రానికి ‎తరలించారు. నిందితురాలని షిపాంజలిని అరెస్టు చేశారు. నిందితురాలిని విచారించగా గతంలో అనేక మంది యువతులను ఈ రొంపిలోకి దించినట్లు పోలీసులకు వెల్లడించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories