అమ్మా అని పిలిచి అపచారం చేశాడు...శ్రీకాకుళం జిల్లాలో దారుణం

అమ్మా అని పిలిచి అపచారం చేశాడు...శ్రీకాకుళం జిల్లాలో దారుణం
x
Highlights

శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. అమ్మా, నాన్నా అని ఆప్యాయంగా పిలుస్తుంటే కొడుకులా చూసుకున్నారు. కానీ... ఆ కొడుకే పాములా మారి కాటేస్తాడనుకోలేదు ఆ తల్లి. శ్రీకాకుళం జిల్లా కంచిలిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మాధవ్ అనే వ్యక్తి ఉపాధి హామీ పథకంలో ఇంజనీరింగ్ కన్సెల్టెంగా పనిచేస్తున్నాడు. అయితే గతంతో కంచిలిలో పనిచేసినప్పుడు స్టేట్‎బ్యాంక్ సమీపంలో అద్దె ఇంట్లో పై అంతస్తులో ఉండేవాడు. అదే అద్దె ఇంటి కింద్రి పోర్షన్ లో ప్రముఖ బ్యాంక్ ఉండేది.

శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. అమ్మా, నాన్నా అని ఆప్యాయంగా పిలుస్తుంటే కొడుకులా చూసుకున్నారు. కానీ... ఆ కొడుకే పాములా మారి కాటేస్తాడనుకోలేదు ఆ తల్లి. శ్రీకాకుళం జిల్లా కంచిలిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మాధవ్ అనే వ్యక్తి ఉపాధి హామీ పథకంలో ఇంజనీరింగ్ కన్సెల్టెంగా పనిచేస్తున్నాడు. అయితే గతంతో కంచిలిలో పనిచేసినప్పుడు స్టేట్‎బ్యాంక్ సమీపంలో అద్దె ఇంట్లో పై అంతస్తులో ఉండేవాడు. అదే అద్దె ఇంటి కింద్రి పోర్షన్ లో ప్రముఖ బ్యాంక్ ఉండేది. ఆ బ్యాంక్ లో పనిచేస్తున్న దంపతులతో పరిచయం ఏర్పడింది. పరిచయం పెంచుకున్న మాధవ్ వారితో సన్నిహితంగా ఉండేవాడు. వారిని అమ్మా నాన్నా అని పిలిచేవాడు. ఈ క్రమంలో ఆ దంపతులకు మరింత దగ్గరైయ్యాడు.

మాధవ్ ఆప్యాయంగా పిలుస్తుంటే వారు పొంగిపోయారు. అయితే మాధవ్ పిలుపు వెనుక కామవాంఛ దాగివుందని వారు గ్రహించలేదు. భర్త లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించి సదరు మహిళ స్నానం చేస్తున్నపుడు రహస్యంగా వీడియోలు తీసేవాడు. అనంతరం ఆమెను లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. అనంతరం ఆమెను లోబర్చుకునే ప్రయత్నం చేశాడు. మాధవ్‎ను ఆమె తిరస్కరించింది. మాధవ్‎ను మందలించింది. అప్పటికీ మాధవ్ మాట వినలేదు ఆమెను మరింతగా వేధింపులకు గురిచేశాడు. రెండు రోజుల క్రితం బుధవారం అర్ధరాత్రి సమయంలో కిటికీ వద్దకు వచ్చి తనపై పువ్వు విసరడంతో భర్తకు చెప్పింది. భర్త పరిసరాల్లో వెతికినప్పటికీ ఎవరూ కన్పించలేదు. దీంతో మాధవ్ వేధింపులను ఆమె ఇంట్లో చెప్పుకోలేక మరింతగా కుంగిపోయింది.

ఈ నేపథ్యంలో మాధవ్‎కు వేరే ప్రాంతానికి బదిలీ అయింది. కాగా.. వారం రోజుల క్రితం మళ్లీ కంచిలి వచ్చిన మాధవ్ వివాహితను బ్లాక్‎మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. మాధవ్ వేధింపులు భరించలేక ఆమె తన కుటుంబ సభ్యులకు అసలు విషయం చెప్పింది. కుటుంబ సభ్యులు మాధవ్ ను మందలించాలని నిర్ణయించుకున్నారు. ఈ లోగా ఏం జరిగిందో గురువారం రాత్రి పిల్లలకు భోజనం పెట్టి నిద్రపుచ్చిన తర్వాత వంటగదిలోనే ఫ్యాన్‌కు చీరతో ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు ఆమె మాధవ్ చేష్టల గురించి, అతనికి సహకరించిన రెడ్డి, తులసీల గురించి ఆ లేఖలో రాసింది. మృతురాలికి ఇద్దరూ కుమార్తెలు, ఒక బాబు ఉన్నారు. కుమార్తె ఆత్మహత్య చేసుకున్న సమాచారం అందడంతో కంచిలి చేరుకున్న తండ్రి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం సోంపేటలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నామని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories