Top
logo

దారుణం : మహిళకు బలవంతంగా మద్యం తాగించి.. ఆపై ఘోరం..

దారుణం : మహిళకు బలవంతంగా మద్యం తాగించి.. ఆపై ఘోరం..
X
Highlights

హైదరాబాద్ లో దారుణం జరిగింది. మహిళకు బలవంతంగా మద్యం తాగించి ఆమెపై సామూహిక లైంగికదాడికి తెగబడ్డారు కొందరు...

హైదరాబాద్ లో దారుణం జరిగింది. మహిళకు బలవంతంగా మద్యం తాగించి ఆమెపై సామూహిక లైంగికదాడికి తెగబడ్డారు కొందరు మృగాళ్లు. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం జరిగింది. కొత్తపేట గ్రీన్‌హిల్స్‌ కాలనీకి చెందిన బాధిత మహిళ (32)కు నాలుగేళ్ల కిందటే వివాహం కాగా.. భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుంది. కొన్ని రోజులు కుటుంబసభ్యుల వద్ద మరికొన్ని రోజులు ఒంటరిగా ఆమె ఉంటోంది. ఈ క్రమంలో ఈమెకు మన్సురాబాద్‌కు చెందిన సీసీ కెమెరాల వ్యాపారి మనోజ్‌కుమార్‌ (30)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.

మనోజ్‌కుమార్‌ తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకొని సాహెబ్‌నగర్‌లోని ఓ ఇంట్లో పార్టీ ఉందని ప్రియురాలిని పిలిపించారు. అక్కడికి వెళ్లిన ఆమెకి మనోజ్‌కుమార్, అతని స్నేహితులు బలవంతంగా మద్యం తాగించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. మద్యం మత్తు కారణంగా సదరు మహిళా స్పృహ కోల్పోయారు. స్పృహలోకి వచ్చిన తరువాత తనకు జరిగిన అన్యాయంపై వనస్థలిపురం పోలీçసులకు ఫిర్యాదు చేశారనే. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story