logo

వివాహిత స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరణ

వివాహిత స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరణ
Highlights

ఓ మహిళ స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన బాలుడిని ఛత్రినాక పోలీసులు అరెస్ట్...

ఓ మహిళ స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన బాలుడిని ఛత్రినాక పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం జంగమ్మెట్ ఆర్.ఎన్.కాలనీకి చెందిన వివాహిత 20 రోజుల నుంచి తన ఇంట్లో స్నానం చేస్తూ ఉండగా ఓ మైనర్ బాలుడు సెల్ ఫోన్ లో బంధించాడు. ఆ వీడియో దృశ్యాలను కాస్తా తమ స్నేహితులకు పోస్ట్‌ చేశాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న బాధితురాలు నింధితుడిపై తగిన చర్యలు తీసుకోవాలని ఈ నెల 16న ఛత్రినాక పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు మాత్రం నామమాత్రపుగా కేసు నమోదు చేసి ఆ బాలుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యహరించడంతో బాధితురాలు తీవ్ర మనస్తాపంతో ఛత్రినాక పోలీసు ఠాణాముందే ఒంటిపై కిరోసిన్‌ పోసుకునేందుకు యత్నించింది. దీంతో పోలీసులు మహిళని అడ్డుకొని నచ్చజెప్పి ఇంటికి పంపారు. వెంటనే ఆ బాలుడిని అదుపులోకి తీసుకొని జువైనల్‌ హోంకు తరలించారు.

లైవ్ టీవి

Share it
Top